Nandamuri Balakrishna 50 Years Celebrations: హైదరాబాద్‌లో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నటుడి ప్రయాణానికి 50 ఏళ్ల సందర్భంగా ఆదివారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీ స్థాయిలో వేడుక నిర్వహించింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. ఈ వేడుకకు టాలీవుడ్ తోపాటు ఇతర సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
ఈ మేరకు టాలీవుడ్ దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులతో హాజరుకాలేకపోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా, బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు.