బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ సెన్సార్ బోర్డ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ మూవీ మరోసారి వాయిదా పడటంపై ఘాటుగా స్పందించారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీనిపై కంగనా స్పందించారు.
‘దేశంలోని చట్టం ఏంటంటే.. ఓటీటీలో అయితే ఎటువంటి సెన్సార్ ఉండదు. అనూహ్యమైన హింసను, అశ్లీలతను ప్రదర్శించవచ్చు. రాజకీయంగా పలుకుబడి ఉంటే నిజజీవిత సంఘటనలను కూడా వక్రీకరించి సినిమాలు తీయొచ్చు. ఓటీటీల్లో అంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛలో కొంచెం కూడా మాలాంటి వాళ్లకు ఉండదు. అందుకే భారతదేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీయడానికి మాకు అనుమతి ఉండదు. కొన్ని చిత్రాలు తీయడానికి మనలో కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంది. ఇది అన్యాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.