Jammu And Kashmir Polls bjp releases list of 6 candidates: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 6మందితో కూడిన జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. తాజాగా, విడుదల చేసిన జాబితాలో నౌషేరా నుంచి బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా బరిలో నిల్చుంటున్నారు. ఆయనతోపాటు రజౌరి(ఎస్టీ) నుంచి మాజీ ఎమ్మెల్సీ విబోధ్ గుప్తా, కాశ్మీర్ లోయ నుంచి ఐజైజ్ హుస్సేన్(లాల్ చౌక్), ఆరిఫ్ రాజా(ఈద్గా), అలీ మొహమ్మద్ మీర్(ఖాన్సాహిబ్), హుస్సేన్(చార్ ఎ షరీఫ్) బరిలో నిల్చుంటున్నారు.
కాగా, బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో అభ్యర్థుల సంఖ్య 51కి చేరింది. అంతకుముందు మొదటి జాబితాలో 16 మంది, రెండో జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 మంది శాసనసభ్యులు గల జమ్మూకశ్మీర్ ఎన్నికలు సెప్టెంబర్ 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.