Actor Bala Krishna donate money for flood victims: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ తరుణంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీగా విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. అలాగే వైజయంతీ మూవీస్ రూ. 25లక్షలు, ఆయ్ మూవీ మేకర్స్ వారంతపు వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్ లో 25 శాతం విరాళంగా ప్రకటించారు. అదే విధంగా సినీ నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, తివిక్రమ్ కలిసి రూ.50 లక్షలు, హీరో సిద్ధు జొన్నలగడ్డ రూ.30లక్షలు, విశ్వక్ సేన్ రూ.10లక్షలు విరాళంగా ప్రకటించారు.