Trending Now

Teaser: గోపీచంద్ ‘విశ్వం’ టీజర్ అదుర్స్!

డైరెక్టర్ శ్రీను వైట్ల.. ఒకప్పటి స్టార్ దర్శకుల్లో ఒకరు.. ఆయన మెగాఫోన్ పట్టుకుంటే చాలు, ఆ సినిమా మినిమం గ్యారంటీ హిట్. కానీ గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులు ఆయన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇక, మ్యాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి కూడా అంతే. గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన హిట్ పడలేదు. వీళ్లద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రమే ‘విశ్వం’. ఈ సినిమాపై ఇద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ చూసిన ప్రేక్షకులు అదుర్స్ అంటున్నారు. ఈ సారి వీళ్లిద్దరికీ హిట్ పడటం ఖాయమని చెబుతున్నారు. ఈసారి శ్రీను వైట్ల కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉందని చెబుతున్నారు. ఈ టీజర్‌ను కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా కట్ చేశారు. గోపీచంద్ కామెడీ టైమింగ్, యాక్షన్‌ టీజర్‌లో హైలెట్‌గా ఉంది. హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా రెండు నిమిషాల ‘విశ్వం’ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Spread the love

Related News

Latest News