Trending Now

AP Floods: విజయవాడలో వరద ఉధృతి తగ్గుతోంది: మంత్రి నారాయణ

Minister Narayana Review with Municipal Commissioners: ఏపీలో గత మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలో వరద ఉధృతి తగ్గుతోందన్నారు. అయితే కాల్వల్లో పెద్దఎత్తున పూడిక పేరుకుపోయిందన్నారు. వరద ప్రాంతాల్లో రోడ్లపైనే భారీగా మట్టి, ఇసుక చేరిందన్నారు. ఈ మట్టి, ఇసుకను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నామన్నారు.

కాగా, విజయవాడను మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కృష్ణానదితో పాటు బుడమేరు, మున్నేరుల నుంచి ఒకేసారి వరద రావడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం విశ్రమించదన్నారు. అయితే ఎక్కడా విద్యుత్ కొరత లేదన్నారు.

Spread the love

Related News

Latest News