Prime Minister Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు బ్రిటన్ పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం హమాస్ ను ఓడించాలనే తమ సంకల్పాన్ని మార్చదన్నారు. 14 మంది బ్రిటిష్ పౌరులతోపాటు 1200 ఇజ్రాయెల్ వాసులను హమాస్ పొట్టన పెట్టుకున్న చరిత్ర హమాస్‌ది అన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలవకుండా బ్రిటన్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం హమాస్ చర్యలను మరింత ప్రోత్సహిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు.