ప్రతిపక్షం, నేషనల్: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసులో కేజ్రీవాల్ నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించినా ఏడుసారి కూడా ఆయన హాజరుకాలేదు. లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఏడోసారి జారీ చేసిన సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. నేడు విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఈడీ ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మోదీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు’ అని పేర్కొంది.