Trending Now

Samanta: హీరోయిన్ సమంతకు గాయాలు.. సోషల్ మీడియాలో పోస్ట్

ప్రముఖ హీరోయిన్ సమంతకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సినిమా షూటింగ్‌లో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ‘గాయాలు కాకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా?’ అంటూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మోకాలికి సూదులతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను జతచేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఏం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.అయితే, సమంతకు ఆ గాయాలు ఎలా జరిగాయనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడు గాయమైంది? ఏ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగిందనే విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు.

Spread the love

Related News

Latest News