Free Electricity for Government Educational Institutions: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో 27,862 విద్యాలయాలు ఉన్నాయని, ఈ విద్యాసంస్థలకు నేటి నుంచి ఉచిత విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విద్యతోపాటు ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.