Trending Now

Aay Movie: ఓటీటీలోకి కొత్త మూవీ ‘ఆయ్‌’..ఎక్కడంటే?

Aay Movie OTT Update: ఎన్టీఆర్ బామర్ధిగా టాలీవుడ్‌కు పరిచయమైన నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన యూత్ పుల్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నార్నే నితిన్ జోడిగా నయన్ సారిక నటించారు. అలాగే అంకిత్ కోయ, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.

Spread the love

Related News

Latest News