Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, మియాపూర్, షాపుర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బోరబండ, పంజాగుట్ట, సికింద్రాబాద్, జీడిమెట్ల, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారడంతోనే వర్షం పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 1 నుంచి 2 గంటల్లో నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అలర్ట్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.