Rashmika Mandanna has a minor accident: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. తనకు ఇటీవల ప్రమాదం జరిగిందని ఇన్‌స్టాలో వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం చిన్నదేనని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్అవుతోంది.
‘నెలరోజులుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. ఓ చిన్న ప్రమాదం జరగడంతో ఆగస్టులో చురుగ్గా ఉండలేకపోయా. వైద్యుల సూచనమేరకు ఇంటి వద్ద ఉంటున్నా. త్వరలోనే మళ్లీ బిజీ అవుతా. జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలియదు. హ్యాపీగా జీవించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.’ అని అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఈ మేరకు అభిమానులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.