India thrashes Japan 5-1 for second consecutive win: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు దూసుకెళ్తోంది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌పై 5-1 తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో రెండో విజయం నమోదైంది. భారత్ తరఫున సుఖ్‌జీత్, అభిషేక్, సంజయ్, ఉత్తమ్ సింగ్ గోల్స్ చేశారు. జపాన్ తరఫున కజుమాసా మాత్రమే గోల్ చేశాడు. కాగా, అంతకుముందు తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టు చైనాని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
జపాన్ జట్టుపై ప్రారంభం నుంచే భారత్ అటాకింగ్ చేసింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే అభిషేక్ ఫస్ట్ గోల్ చేశాడు. తర్వాత సుఖ్ జిత్ సింగ్ చేయడంతో ఆధిక్యం లభించింది. రెండో క్వార్టర్ లో జపాన్ అటాకింగ్ చేయగా.. మూడో క్వార్టర్ లో జపాన్ ఓ గోల్ చేసింది. ఇక, చివరి క్వార్టర్ లో భారత్ కీలకంగా ఆడింది. భారత్ ఆటగాళ్లు ఉత్తమ్ సింగ్, సుఖ్ జిత్ చెరో గోలు చేయడంతో భారీ ఆధిక్యం సాధించింది. గురువారం మలేషియా జట్టుపై భారత్ తలపడనుంది.