Central government cash prize for Paralympics winners: ఇటీవలి పారాలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. చెక్కుచెదరని సంకల్పంతో, అసమాన పోరాటంతో పతకాల పంట పండించిన యోధులకు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. గోల్డ్ మెడల్ గెలుపొందిన ఏడుగురికి తలా రూ.75 లక్షలు ఇస్తామని, వెండి పతకం సాధించిన వాళ్లకు రూ. 50 లక్షలు, కాంస్యం విజేతలకు రూ. 30 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఇక మిక్స్డ్ టీమ్ విభాంలో పతకంతో సత్తా చాటినవాళ్లకు రూ.22.5 లక్షల నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.