Delhi Chief Minister Arvind Kejriwal’s Bail: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మద్యం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 5నెలల పాటు జైలులో ఉన్నారు.
కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడొద్దని షరతు విధించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీ సంతకాలతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో సీబీఐ అరెస్ట్ చేసింది.