Trending Now

Devara Movie: అరుదైన ఘనత.. హాలీవుడ్‌ అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘షో’

Devara Movie California Film Festival: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ షోకి హాలీవుడ్ తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటించారు.

Spread the love

Related News

Latest News