Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ టీమ్ రసవత్తరపోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్.. ఇవాళ మధ్యాహ్నం తన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లైవ్ లో చూడొచ్చు.