Trending Now

NTR Fan: క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్‌ వీడియో కాల్‌!

NTR’s video call to a fan who is fighting cancer: ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చనిపోయేలోపు ‘దేవర’ మూవీ చూడాలని బలంగా కోరుకున్నాడు. తల్లిదండ్రులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నంతో ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలిసింది. దీంతో ఇవాళ కౌశిక్‌తో ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. తొందరగా కోలుకొని రావాలని, ఏమీ కాదని ధైర్యం చెప్పారు. మరోవైపు, తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్‌ తల్లి మీడియా ఎదుట కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కాల్ చేయడంతో వారి కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

Spread the love

Related News

Latest News