కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే పైరవీలు
గతంలో పోటీకి నిరాకరించిన నేతలు నేడు పోటీకి ‘సై’
ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్న నేతలు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీలో ఒక్కసాగిగా ఆశావహులు పుట్టుకొస్తున్నారు. గతంలో పోటీకి నై అన్న నేతలు దేశ రాజకీయాల్లో భారీగా మార్పులు కనిపిస్తుండడంతో నేను సైతం అంటూ ముందస్తుగానే కట్చీఫ్ వేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఇండియా కూటమికి కాంగ్రెస్‌కు మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీకి సై అంటూ సైగ చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, ఎప్పటి నుంచే నియోజకవర్గం ప్రజలకు సేవలు అందిస్తున్నానంటూ సీనియర్ నేత వి. హన్మంతరావు సోమవారం గాంధీభవన్‌లో మీడదియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అలాగే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తన పదవికి రాజీనామాను సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తాను నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటూ సీఎంకు తెలిపానని, సీఎం సైతం మద్దతు ప్రకటించారన్నారు.
అయితే నాగర్‌కర్నూల్ నుంచి ఆలంపూర్ మా.జీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ సైతం పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేఇ మరోసారి పోటీ చేయాలని ప్రస్తుతం బీఆరహ్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు ప్రయత్నించినట్లు, లయితే ఇక్కడ పోటీకి కుదరన్న సంకేతాలు సీఎం నుంచి రావడంతో ఆయన మనసు మార్చుకొని బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. అలాగే పెద్దపల్లి , వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌ను అడిగి టికెట్ తీసుకుంటానంటూ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను సైతం: వీహెచ్
ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని.. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇండియాలో తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా? అని అడిగారు. ‘‘రేవంత్‌పై నాకు నమ్మకం ఉంది. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో రేవంత్, నేనే ఎక్కువ తిరిగాము. మిగతా నాయకులంతా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. నేను ఎంతో మంది నాయకులను తయారు చేశాను. చిన్న వయసులో ఉన్నానని నాకు సీఏం పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు. రేవంత్‌కు నేను సపోర్ట్ చేశాను. ఇకపై కూడా చేస్తాను’’అని ఆయన అన్నారు.
ఎంపీ టికెట్‌పై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ కావాలనుకుంటే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని అన్నారు. బీజేపీ తనపై అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.బీజేపీలో చాలా మంది షార్ట్ కట్ నేతలే ఉన్నారన్నారు. ఆ పార్టీ నేతల చరిత్రంతా తనకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క రోజే సంతోషంగా ఉండేవాడినని.. ప్రస్తుతం రోజంతా సంతోషంగా ఉంటున్నట్లు కామెంట్స్ చేశారు.