Green signal for new ration cards: తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. కొత్త రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి జారీ చేయనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు కావాలని గతంలో నిర్వహించిన ‘ప్రజా పాలన’లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో అప్లై చేసుకోలేకపోయిన వారి కోసం మరోసారి ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనూ వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అందరికీ అక్టోబర్ నెలలో కొత్త కార్డులను జారీ చేయాలని ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ నేతృత్వంలో భేటీ అయిన సబ్ కమిటీ నిర్ణయించింది.