Trending Now

IND vs BAN 1st Test: అశ్విన్ సెంచరీ.. భారత్ స్కోర్ 339/6

Ravichandran Ashwin scores century against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 56 పరుగులతో రాణించగా.. కేెల్ రాహుల్ 16, రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లి 6, శుభమన్ గిల్ డకౌట్‌తో విఫలమవగా.. రిషబ్ పంత్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు.

టాప్ ఆర్డర్ విఫలమైనా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 108 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. అశ్విన్‌కు తోడుగా రవీంద్ర జడేజా 117 బంతుల్లో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మొహమూద్ 4 వికెట్లు పడగొట్టగా..రానా, మిరాజ్ చెరో వికెట్ తీశారు.

Spread the love

Related News

Latest News