Trending Now

Pager Attack: 4వేల మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర: హెజ్‌బొల్లా చీఫ్‌

Hezbollah chief denounces Israeli attacks: 4000 మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర పన్నారని హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా ఆరోపణలు చేశారు. దాదాపు నాలుగు వేల పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని నస్రల్లా అన్నారు. పరికరాల పేలుళ్ల ఘటనలను యుద్ధ నేరాలు, యుద్ధ ప్రకటనగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి.. మరో వెయ్యి మందిని హతమార్చేందుకు యత్నించారన్నారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని, ఈ ఘటనలు ఊచకోతలుగా నస్రల్లా పరిగణించారు. మరోవైపు నస్రల్లా ప్రసంగం వేళ బీరుట్‌లో తక్కువ ఎత్తులో భీకర శబ్దాలతో యుద్ధ విమానాలు దూసుకెళ్తున్నాయి. కాగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ పక్కా ప్రణాళిక ఉన్నట్లు భావిస్తున్నారు. మొత్తం 5 వేలకు పైగా పేజర్లు పేలిన ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు.

Spread the love

Related News

Latest News