Jasprit Bumrah becomes sixth Indian pacer to take 400 wickets: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల్లో 400 వికెట్లు పూర్తి చేసిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆరో పేసర్‌గానూ బుమ్రా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ ఆటగాడు హసన్ మహమూద్ వికెట్ తీయడంతో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. 2018లో టెస్ట్‌ల్లో అరంగ్రేటం చేసిన బుమ్రా.. 227వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ని సాధించాడు. ఈ మేరకు162 టెస్ట్ వికెట్లు, 149 వన్డే వికెట్లు, 89 టీ20 వికెట్లు తీశాడు. అయితే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా కంటే ముందు అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉన్నారు. అనిల్ కుంబ్లే(953), ఆర్.అశ్విన్ (744), హర్భజన్‌సింగ్ (707), కపిల్‌దేవ్ (687), జహీర్‌ఖాన్(597), రవీంద్ర జడేజా(570), జవగళ్ శ్రీనాథ్(551), మహ్మద్ షమీ (448), ఇషాంత్ శర్మ(434), జస్పీత్ బూమ్రా (400) వికెట్లు తీశారు.