Virat Kohli LBW Review Rohith Reaction: చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 81/3 పరుగులు చేసింది. దీంతో బంగ్లాపై 308 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(33), రిషబ్ పంత్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 17 పరుగుల వద్ద మెహిదీ హసన్ వేసిన బంతికి ఔటయ్యాడు. కానీ ఈ బంతి విరాట్ ప్యాడ్‌కు తగలగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీంతో విరాట్ మరో బ్యాటర్ గిల్‌తో చర్చించి రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ చేరాడు.
కానీ తర్వాత రిప్లే చూస్తే..ప్యాడ్‌ను తాకడానికి ముందు బంతి కోహ్లి బ్యాట్ అంచును తాకింది. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరింటే నాటౌట్‌గా ప్రకటించేవాడు. దీంతో రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రివ్యూ కోరాల్సి ఉండొచ్చు కదా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మరోవైపు ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తన తప్పును చూసి తర్వాత చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.