‘Saripoda Shanivaram’ OTT release date fixed: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ ‘సరిపోదా శనివారం’. వారంలో ఒక్క శనివారం మాత్రమే కోపాన్ని చూపించే వ్యక్తిగా నాని నటించారు. ఇందులో నాని-ఎస్.జె. సూర్య అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. ఆగస్టు 29న రిలీజైన ఈ సినిమాకు వర్షాలు అడ్డంకిగా మారాయి. రిలీజైన రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.