Hydra demolitions in Kukatpally: ఆదివారం వచ్చిందంటే చాలు, హైడ్రా అధికారులు వచ్చి ఎక్కడ తమ నిర్మాణాలను కూల్చివేస్తారోనని నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. దీనిలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.