Trending Now

America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

There is another shooting in America: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. గన్ కల్చర్‌ను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అలబామ రాష్ట్రంలోని ఓ బార్‌ వెలుపల కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love

Related News

Latest News