Devara release trailer release: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిందే. ఓవర్సీస్ ఈ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ‘రిలీజ్ ట్రైలర్‌ను’ మేకర్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాలా – భయం రావాలంటే దేవర కథ వినాల.. సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల’ వంటి డైలాగ్స్ ట్రైలర్ లో కేక పుట్టిస్తున్నాయి. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారు అంతే స్థాయిలో అదే రీతిలో గ్రాండ్ స్కేల్ లో ట్రైలర్ కట్ చేసినట్లు చెబతున్నారు.. మరోవైపు.. ఇవాళ సాయంత్రం 6: 00 గంటలకు దేవర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని నోవాటెల్ (HICC) లో భారీ స్థాయిలో జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకులు త్రివిక్రమ్, SS రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.