CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరన్నారు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యతని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహామండలి నిర్ణయించిందన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ, ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని, సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.