TTD said Don’t have any doubts about the laddu prasadas: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ చేస్తున్నామన్నారు. ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని తెలిపారు. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.