Kalki, Hanuman, Mangalavaram in ‘Oscar’ race!?: ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులైనా, మూవీ మేకర్స్ అయినా తాము జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకునే అవార్డ్ ‘ఆస్కార్’.. ప్రపంచ సినీ చరిత్రలోనే ‘ఆస్కార్’ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ అవార్డ్ అందరి కల. ఇక, గతేడాది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అసాధ్యమనుకున్న దానిని రాజమౌళి సుసాధ్యం చేసి చూపించారు.
ఇక, ఈ ఏడాది కూడా ఆస్కార్ ఎంట్రీలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్‌కి.. తెలుగు భాషా విభాగంలో నాగ్ అశ్విన్ – ప్రభాస్‌ల ‘కల్కి 2898 ఏడీ, ప్రశాంత్ వర్మ- తేజ సజ్జాల హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు బరిలో నిలిచాయని ఫిలింనగర్ టాక్. మరి వీటిలో ఏ సినిమాలను కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఆస్కార్ నామినేషన్స్‌కి పంపిస్తుందో వేచి చూడాలి.