274 Killed Including 21 Children In Israeli Strikes: లెబనాన్ అతివాద సంస్థ హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. వందలాది స్థావరాలపై దాడులు చేయగా.. 274 మంది మృతి చెందారు. ఈ దాడుల్లో మరో 700 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో 27 మంది చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇదిలా ఉండగా, లెబనాన్‌లో దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ స్పందించారు. లెబనాన్‌లో మా దాడులను తీవ్రతరం చేస్తున్నామన్నారు. మా ప్రజలు ప్రశాంతంగా నివసించాలనే మా లక్ష్యం నెరవేరే వరకు మా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.