The film ‘Devara’ is a new record in overseas: ఇండియా మొత్తం ప్రస్తుతం ఒకే ఒక్క పేరు గట్టిగా వినిపిస్తోంది.. దేవర.. దేవర.. దేవర..! మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రెస్టిజీయస్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘దేవర’ మ్యానియానే కనిపిస్తోంది. దాంతో ఈసారి తారక్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ రికార్డుల దండయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న ఈ చిత్రం.. తాజాగా రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా అందుకున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.