Trending Now

Harini Amarasuriya: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

Harini Amarasuriya named as new Sri Lankan Prime Minister: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు. అయితే శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన రెండో మహిళగా హరిణి గుర్తింపు పొందింది. అంతకుముందు సిరిమావో బండారు నాయకే (1994-2000) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, 54 ఏళ్ల హరిణి అమరసూర్య నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందినది, ఆమెతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా మరో ఇద్దరు నేతలను క్యాబినెట్‌ మంత్రులుగా నియమించారు. దీంతో శ్రీలంకలో అధ్యక్షుడు అమర కుమార దిసనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్యతో పాటు మొత్తం నలుగురితో కూడిన మంత్రివర్గం కొలువుదీరింది. ఇక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్యకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించారు.

Spread the love

Related News

Latest News