35 Chinna Katha Kaadu’s new OTT release date is here: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించగా.. రానా నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుందని ఆహా పోస్టర్ను పంచుకుంది.