Draupadi Murmu visit hyderabd: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సకాన్ని రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. అలాగే మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి తిరిగి వెళ్లే వరకు మంత్రి సీతక్క వెంటనే ఉండనున్నారు. రాష్ట్రపతితోపాటు గౌరవ అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, నల్సార్ చాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరుకానున్నట్లు యూనివర్సిటీ వీసీ కృష్ణదేవరావు తెలిపారు.