Chiranjeevi received Cinema Award at IIFA: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్నారు. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్ రెహమాన్, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పలువురు నటులకు అవార్డులు వరించాయి. ఇందులో ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారం అందుకున్నారు. ఇక ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సమంత గెలుచుకున్నారు.