devara movie first day collection: టాలీవుడ్ యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’, ఈ మూవీ గత కొంతకాలంగా సినీ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఎన్నో అంచనాలతో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. దేశ వ్యాప్తంగా రూ.77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140కోట్లు వసూళ్లు చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సుమారు. రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసిందని సమాచారం.