Applications for new ration cards in first week of October: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా..? అని ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రతి గ్రామం, వార్డుల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులే అక్కడికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తప్పక అందిస్తామని అన్నారు.