Trending Now

Udayanidhi: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

Udayanidhi Stalin to take oath as Deputy CM of Tamil Nadu: అందరూ అనుకున్నట్లుగానే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అప్పగించనున్నారు. సీఎం స్టాలిన్ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు గవర్నర్ ఆర్ఎన్ రవి శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. మనీలాండరింగ్‌ కేసులో జైలుకు వెళ్లి, రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. అదే విధంగా డా.గోవి.చెళియన్‌, ఆర్‌.రాజేంద్రన్‌, ఎస్‌ఎం నాజర్‌లనూ మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. మనో తంగరాజ్‌ సహా ముగ్గురు మంత్రులను క్యాబినెట్‌ నుంచి తప్పించారు.

Spread the love

Related News

Latest News