Trending Now

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్

India Takes Lead of Second Test Against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా డిక్లేర్‌ చేసింది. డిక్లేర్‌ చేసే సమయానికి భారత్‌ 8 వికెట్లకు 285 పరుగులు చేసింది. యశస్వి (72), కేఎల్‌ రాహుల్‌ (68), విరాట్‌ (47), శుభ్‌మన్‌ గిల్‌ (39) రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మిరాజ్‌ 3, షకీబ్‌ 4, హసన్‌ మహ్ముద్‌ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్‌ 52 పరుగుల ముందంజలో ఉంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినల్ హక్ (107*) సెంచరీ చేశాడు. నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20), లిటన్ దాస్ (13), ముష్ఫికర్ రహీమ్ (11), షకిబ్ (9) రాణించలేదు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, సిరాజ్ 2, ఆకాశ్‌ దీప్‌ 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 2, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ 107/3 స్కోరుతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News