ED books Karnataka CM Siddaramaiah in MUDA: కర్ణాటక సీఎంకు బిగ్ షాక్ తగిలింది. ముడా స్కాంలో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. ముడా స్కాంలో భాగంగా ఆయనపై కేసు నమోదు చేయాలంటూ 27వ తేదీన స్నేహమయి కృష్ణ ఈడీకి లేఖ రాశాడు. దీంతో కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుడిగా సిద్ధరామయ్యతోపాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితో పాటు మరో వ్యక్తి పేర్లను జాబితాలో చేర్చింది. సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములను ‘ముడా’ స్వాధీనం చేసుకుని మరొక చోట స్థలాలు మంజూరు చేసింది. అయితే స్వాధీనం చేసుకున్న భూముల కంటే మంజూరు చేసిన స్థలాల విలువ ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనపై లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది.



























