Trending Now

The GOAT: ఓటీటీలోకి విజయ్‌ ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

The GOAT Movie In OTT: విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్‌’. ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్‌ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి ఆకట్టుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అక్టోబర్‌ 3 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇందులో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. త్రిష అతిథి పాత్రలో కనిపించారు.

Spread the love

Related News

Latest News