AP Deputy CM Pawan Kalyan To Visit Tirumala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ కల్యాణ్ తిరుమలకు బయల్దేరగా.. తిరుమల కొండ ఎక్కుతున్న క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధ పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయనకు సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండడంతో సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడినట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. కాగా, పవన్ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.