AP CM Chandrababu to Delhi on 7th of this month: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు.. రాజధాని అమరావతికి నిధులు, మరికొన్ని ఇతర అంశాలకు కేంద్ర సాయాన్ని కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.