Trending Now

Actor Mohan raj: సినీ పరిశ్రమలో విషాదం.. మోహన్‌రాజ్‌ కన్నుమూత

Legendary Actor Mohan Raj Passes Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణాదిలో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ రాజ్(72) కన్నుమూశారు. కేరళలోని తరువనంతపురం ప్రాంతంలోని కంజిరంకులంలో అతని నివాసంలో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ మేరకు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటులు అధికారికంగా వెల్లడించారు. దీంతో మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

మోహన్ రాజ్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగులో ‘లారీ డ్రైవర్‌’, ‘స్టువర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’, ‘చినరాయుడు’, ‘నిప్పు రవ్వ’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్న కేశవరెడ్డి’, ‘శివమణి’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో మోహన్‌బాబు కథానాయకుడిగా రూపొందిన ‘శివశంకర్‌’ చిత్రంలో ఆయన చివరిగా నటించారు.

Spread the love

Related News

Latest News