NTR movie with ‘Jailor’ director: ‘దేవర’ మూవీ సాలిడ్ హిట్‌తో ఎన్టీఆర్ పేరు.. పాన్ ఇండియాలో గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేందుకు ఎంతో మంది పాన్ ఇండియా డైరెక్టర్లు ఆసక్తిచూపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్.. తాజాగా ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఓ అద్భుతమైన కథను కూడా రాసే పనిలో పడ్డాడట నెల్సన్. మరోవైపు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైన్ అప్‌లోకి చాలా మంది దర్శకులు వస్తున్నారు. ఇప్పటికే వెట్రిమారన్‌తో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు. వెట్రిమారన్ కూడా దీనిని ధృవీకరించారు. హిందీలో ఇప్పటికే ‘వార్ 2’ సినిమాలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.ఇక, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.