Trending Now

Youtube: కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పిన యూట్యూబ్!

Good news for YouTube content creators: కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఇకపై 3 నిమిషాల నిడివి గల వీడియోలను సైతం అప్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. ప్రస్తుతం 60 సెకన్ల లోపు వీడియోలు మాత్రమే అప్ లోడ్ చేసే వీలుంది. కానీ ఇప్పటి నుంచి ఏకంగా 3 నిమిషాల వీడియోలను సైతం అప్‌లోడ్ చేయవచ్చు. ఇది క్రియేటర్‌లకు స్టోరీలు చెప్పడంతో పాటు వ్యూయర్లతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు మరింత అవకాశాన్ని అందిస్తుంది. అక్టోబర్‌ 15 నుంచి ఈ ఫీచర్ అందుబాటులోనికి రానుంది.

Spread the love

Related News

Latest News