Actor Rajendra Prasad Daughter Gayatri passed away: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి 1గంట సమయంలో మరణించినట్లు సమాచారం. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం అని తెలిసింది. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఈవెంట్‌లో తన కుమార్తె రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు.